అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కంటున్న విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ టెక్ నిపుణులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన H-1B వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (100,000 డాలర్లు) భారీ ఫీజు అమలుకు అమెరికా ఫెడరల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫీజును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను అమెరికా జిల్లా న్యాయమూర్తి బెరిల్ హోవెల్ కొట్టివేశారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అధ్యక్షుడికి ఈ స్థాయిలో వీసా ఫీజును పెంచే అధికారం లేదని.. ఇది చట్ట విరుద్ధమని వారు వాదించారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి పూర్తిగా తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన విస్తృత అధికారాల పరిధిలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందులో కోర్టు జోక్యం అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, దేశీయ ఉద్యోగాల రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇమ్మిగ్రేషన్ విధానాల్లో మార్పులు చేయడానికి అధ్యక్షుడికి పూర్తి హక్కు ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది న్యాయస్థాన పరిధిలోకి రాని పాలసీ డిసిషన్ అని కూడా స్పష్టం చేసింది.ఈ తీర్పు అమెరికాలో విదేశీ నైపుణ్యంపై ఆధారపడే టెక్ కంపెనీలకు పెద్ద షాక్‌గా మారింది.
ఇప్పటికే ఖరీదైన వీసా ప్రక్రియను ఈ లక్ష డాలర్ల ఫీజు మరింత భారంగా మార్చనుంది. ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా కంపెనీలు ఇకపై విదేశీ టాలెంట్‌ను నియమించుకోవడం దాదాపు అసాధ్యంగా మారే పరిస్థితి నెలకొంది.భారతదేశానికి చెందిన ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు ప్రతి ఏడాది వేల సంఖ్యలో H-1B వీసాల కోసం దరఖాస్తు చేస్తుంటాయి. తాజా ఫీజు నిబంధన అమలైతే.. ఈ కంపెనీలపై వందల కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశముంది. దీని ప్రభావం ప్రాజెక్ట్ ఖర్చులు, ఉద్యోగ నియామకాలు, అమెరికాలో విస్తరణ ప్రణాళికలపై కూడా పడనుంది.
ఈ తీర్పు కంపెనీలకే కాదు, అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలనుకునే భారతీయ యువత ఆశలపై కూడా నీళ్లు చల్లినట్టుగా మారింది. ఇప్పటికే H-1B లాటరీ విధానం, కఠిన వీసా పరిశీలన, పెరిగిన నిరాకరణలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మరో పెద్ద అడ్డంకిగా మారింది. నిపుణుల మాటల్లో చెప్పాలంటే ఈ నిర్ణయం అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినంగా మారుతున్నాయనే సంకేతంగా చెబుతున్నారు. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఇంకా ఉంది. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంస్థలు తదుపరి లీగల్ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఏదేమైనా H-1B వీసాపై లక్ష డాలర్ల ఫీజు మీద కోర్టు తీర్పుతో విదేశీ టెక్కీలకు పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి. అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరి కొనసాగిస్తుందనే విషయం ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ఇది కేవలం ఒక చట్టపరమైన నిర్ణయం కాకుండా వేల మంది భారతీయుల భవిష్యత్ ప్రణాళికలను ప్రభావితం చేసే కీలక మలుపుగా చెప్పవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications