స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద మూడు రెట్లు జంప్

భారతీయులు, భారతీయ కంపెనీల సంపద స్విస్ బ్యాంకులో 2020 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ.20,700 కోట్లకు చేరుకుంది. రెండేళ్ల పాటు క్షీణించినప్పటికీ గత క్యాలెండర్ ఏడాదిలో మాత్రం నిధులు పెరిగాయి. తద్వారా గత ఏడాది 13 సంవత్సరాల గరిష్టానికి చేరుకున్నాయి. 2019 క్యాలెండర్ ఏడాది ముగిసే సమయానికి ఇండియన్లు, ఇండియన్ కంపెనీలు దాచుకున్న సొమ్ము విలువ దాదాపు రూ.6,625 కోట్లుగా నమోదయ్యాయి. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

స్విస్ సెంట్రల్ బ్యాంకు నివేదిక

స్విస్ సెంట్రల్ బ్యాంకు నివేదిక

కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో క్షీణించినట్లు స్విట్జర్లాంట్ సెంట్రల్ బ్యాంకు విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్స్ 2020లో దాదాపు 2 ల‌క్ష‌ల కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు చేరుకున్నాయి. ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్స్ 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ తొలి స్థానంలో ఉంది. 152 బిలియన్లతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 100 బిలియన్ ఫ్రాంక్స్‌కు పైగా ఉన్న దేశాలు ఈ రెండు మాత్రమే. 2020 చివరి నాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పని చేస్తున్నాయి.

అప్పుడు మినహాయిస్తే

అప్పుడు మినహాయిస్తే

2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు కాగా, 2011, 2013, 2017 సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన సంవత్సరాల్లో ఈ పరిమాణాలు డౌన్ ట్రెండ్‌లోనే నడిచాయి. 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్ 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ.4000 కోట్లు. 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్స్.

నల్లధనం గురించి ప్రస్తావన లేదు

నల్లధనం గురించి ప్రస్తావన లేదు

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం గురించి ఇందులో ప్రస్తావన లేదు. ఇక్కడ దాచిన సొమ్మును నల్లధనంగా పరిగణించమని ఆ దేశం పలుమార్లు చెప్పింది. పన్ను ఎగవేతలు, అక్రమ ఆర్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు సహకరిస్తామని తెలిపింది. ఇందుకు రెండు దేశాల మధ్య 2018 నుండి ఒక అవగాహన ఒప్పందం అమల్లో ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+