భారతీయులకి చుక్కలు చూపిస్తున్న దుబాయ్ ప్రభుత్వం..? ఇదేం కొత్త సమస్య..!!
హాలీడేస్ ట్రిప్, వకేషన్స్ లేదా విజిటింగ్ పై ఇతర దేశాలకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు వహించాల్సిన ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ కలిసి వెళ్లే టూర్స్ కి తప్పకుండ అన్ని పేపర్స్, డాకుమెంట్స్ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దుబాయ్‌కి టూరిస్ట్ వీసా కావాలంటే క్యూఆర్ కోడ్ అండ్ రిటర్న్ హోమ్ టికెట్ కాపీతో హోటల్ బుకింగ్ వివరాలు సబ్మిట్ చేయాలనీ దుబాయ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ కొన్ని వారాల క్రితం కొత్త రూల్ ప్రవేశపెట్టిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.
అయితే ఈ కఠినమైన వీసా నిబంధనల కారణంగా దుబాయ్ వెళ్లాలని ప్లాన్ చూస్తున్న భారతీయ ప్రయాణికులు కొత్త సమస్య ఎదురుకుంటుండటంతో ఈ నిబంధన ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. డాక్యుమెంటరీ అభ్యర్థనల ఆధారంగా భారతీయులే ఎక్కువగా వీసా రిజెక్షన్స్ ఎదుర్కొంటున్నారట. తమిళులు, భారతీయులు ఎక్కువగా నివసించే విదేశీ నగరాల్లో దుబాయ్ ఒకటి. దేశం నలుమూలల నుంచి రోజూ వేలాది మంది దుబాయ్ నగరానికి ప్రయాణిస్తుంటుంటారు. వీసా విధానంలో దుబాయ్ ప్రభుత్వం చేస్తున్న కొత్త మార్పులు, కొత్త విధానాలు భారతీయులకు ఇపుడు ఎదురుదెబ్బగా మారుతున్నాయి.

దీనికి సంబంధించి ట్రావెల్ ఏజెన్సీ మాట్లాడుతూ ఇంతకుముందు దాదాపు 99% అప్లికేషన్స్ ఆమోదించేవారు. గత కొన్ని నెలలుగా ట్రావెల్ డాకుమెంట్స్ రిజెక్షన్స్ పెరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం హోటల్ బుకింగ్ కన్ఫర్మేషన్, రిటర్న్ ఎయిర్ టిక్కెట్లు, ఒకవేళ బంధువులతో ఇంట్లో ఉంటే అదనంగా వసతికి సంబంధించిన ప్రూఫ్ తో సహా డాక్యుమెంటేషన్ అందించాల్సి ఉంటుంది. ఏదిఏమైనప్పటికి చాలా అప్లికేషన్ రిజెక్ట్ అవుతున్నాయి, దింతో ప్రయాణికులకు భారీగా ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి అని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఈ కొత్త వీసా విధానాలతో పెరిగిన రిజెక్షన్ రేటు వ్యక్తిగత ప్రయాణీకులను మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులను కూడా ప్రభావితం చేసినట్లు ట్రావెల్ ఏజెన్సీలు వస్తావ పరిస్థితిని వివరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక వీసా అప్లికేషన్ రిజెక్ట్ కావడం వల్ల మొత్తం గ్రూప్ టూర్ కూడా క్యాన్సల్ అవుతున్నాయి, ఫలితంగా ఆర్థిక నష్టాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం హోటల్ బుకింగ్ డాక్యుమెంట్లు, రిటర్న్ హోమ్ టికెట్ పేపర్స్ అడుగుతుండటంతో వీసా రిజెక్షన్ గురైతే దీనికోసం వెచ్చించిన డబ్బు అంతా వృథా అవుతుంది. దుబాయ్‌ని సందర్శించాలనుకునే వారికీ ఇది పెద్ద నిరాశ. అందుకే వీసా రిజెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి అన్ని పేపర్లు జాగ్రత్తగా పరిశీలించి కొత్త నిబంధనల ప్రకారం తీసుకురావాలని ట్రావెల్ ఏజెన్సీలు గత కొన్ని రోజులుగా ప్రయాణికులను కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications