Liquor Sales: కరోనా సమయంలో రికార్డులు బద్దలయ్యేలా తాగేశారు.. వాటికే ఎక్కువ డిమాండ్..!

Liquor Sales: కరోనా మహమ్మారి కారణంగా.. గత ఏడాది దేశంలో చాలా కాలం పాటు ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే.. ఈ కాలంలో దేశంలో బీరు, మద్యం విక్రయాలు దశాబ్ద కాలం నాటి రికార్డును బద్దలు కొట్టాయి. 2021లో ప్రజలు బీర్, విస్కీ, వోడ్కా, జిన్‌లను ఎక్కువగా సేవించారని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది వాటి అమ్మకాలు ఏకంగా 17-18 శాతం పెరిగాయి. ఇది దశాబ్ద కాలంలో అత్యధికంగా ఉంది. మహమ్మారి కారణంగా మద్యం పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. 2020లో మద్యం అమ్మకాలు 20 శాతం, బీరు అమ్మకాలు 39 శాతం తగ్గాయి. దేశంలో మొత్తం మద్యం వినియోగంలో విస్కీ, బ్రాందీ, రమ్ వాటా 97 శాతంగా ఉంది.

ప్రీమియం లిక్కర్ అమ్మకాలపై దృష్టి:

ప్రీమియం లిక్కర్ అమ్మకాలపై దృష్టి:

వచ్చే ఐదేళ్లలో దేశంలో వైన్ మార్కెట్ 4.4 శాతం, బీర్ మార్కెట్ 9.3 శాతం వృద్ధి చెందుతుందని యూకే పరిశోధనా సంస్థ చెబుతోంది. గత ఐదేళ్ల కాలంలో దేశంలో మద్యం మార్కెట్ ఫ్లాట్‌గా ఉండగా.. బీర్ మార్కెట్ 3.7 శాతం క్షీణించింది. కానీ కంపెనీల ప్లాన్ వేరే విధంగా ఉంది. అమ్మకాలు పెంచే బదులు ఖరీదైన మద్యం తాగించటం ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. డియాజియో వంటి కంపెనీలు చీప్ లిక్కర్ కాకుండా ప్రీమియం మద్యంపై దృష్టి సారిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద మద్యం కంపెనీ USL మేనేజింగ్ డైరెక్టర్ హీనా నాగరాజన్ మాట్లాడుతూ డిమాండ్ తిరిగి వస్తోందని, ప్రీమియం నాణ్యత గల మద్యం వినియోగం పెరుగుతోందని అన్నారు. USL ఇటీవలే సింగపూర్‌కు చెందిన కంపెనీకి 32 చౌక బ్రాండ్‌లను విక్రయించడానికి ఒప్పందంపై సంతకం చేసింది.

పెరుగుతున్న బీర్ల విక్రయాలు:

పెరుగుతున్న బీర్ల విక్రయాలు:

లాక్‌డౌన్ కారణంగా రెండేళ్ల ఏప్రిల్-జూన్ సీజన్ బీర్ అమ్మకాలను ప్రభావితం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వస్తోందని IWSR విశ్లేషకుడు జాసన్ హాల్‌వే చెప్పారు. బార్‌లు, రెస్టారెంట్లు తెరుచుకోవటంతో ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటు ఎండ వేడిమితో బీర్ల విక్రయాలు కూడా పెరిగాయి. బ్రాందీ, రమ్ అమ్మకాలు ఇంకా ట్రాక్‌లోకి రాలేదని IWSR తెలిపింది. వారు ప్రీ-కరోనా స్థాయిలను చేరుకోవడానికి 2026 వరకు వేచి ఉండవలసి ఉంటుందని అంచనా వేస్తోంది. కానీ విస్కీ అమ్మకాలు ఈ ఏడాది 2019 అమ్మకాలను అధిగమిస్తాయని అంచనా.

ఏవి ఎక్కువగా తాగుతున్నారంటే..

ఏవి ఎక్కువగా తాగుతున్నారంటే..

దేశంలో మొత్తం మద్యం వినియోగంలో విస్కీ, బ్రాందీ, రమ్ వాటా 97 శాతంగా ఉంది. అయితే గతేడాది వోడ్కా, వైట్ రమ్ విక్రయాలు దాదాపు 17.5 శాతం పెరిగాయి. అదేవిధంగా జిన్‌ విక్రయాలు కూడా 50 శాతం పెరిగాయి. ఏప్రిల్-మే 2020, 2021లో లాక్‌డౌన్ కారణంగా బీర్ అమ్మకాలు ప్రభావితమయ్యాయి. కానీ దాని డిమాండ్ కోలుకుంటోంది. 1-2 సంవత్సరాల్లో బీర్ల డిమాండ్ తరిగి 2019 స్థాయికి చేరుకోవచ్చని తెలుస్తోంది.

ఎవరి వినియోగం ఎక్కువ:

ఎవరి వినియోగం ఎక్కువ:

కరోనా కారణంగా బార్‌లు, రెస్టారెంట్లు, పబ్బులను మూసివేయడం వల్ల బీర్, మద్యం అమ్మకాలు ప్రభావితమయ్యాయి. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మళ్లీ మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. డియాజియో, పెర్నోడ్ రికార్డ్, అబ్ ఇన్‌బెవ్ ప్రీమియం ఆల్కహాల్‌పై దృష్టి సారించాయి. పెర్నోడ్ రికార్డ్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ థిబాల్ట్ కునీ అధిక నాణ్యత, అధిక విలువ కలిగిన వైన్‌ను విక్రయించాలనుకుంటున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+