పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. సురక్షితమైన డిమాండ్ గా ఏది నిలుస్తుందో దానిపై ఇన్వెస్టర్లు తమ దృష్టిని నిలిపారు. ఈ నేపథ్యంలోనే వారికి కనిపించింది బిట్‌కాయిన్. భారత్ దేశంలో చాలామంది పెట్టుబడి దారులు ఇప్పుడు బంగారాన్ని వదిలేసి డిజిటల్ కరెన్సీ మీద పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో బిట్ కాయిన్ బిజినెస్ చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయమని చెప్పుకోవచ్చు.
అగ్రరాజ్యం అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక బిట్‌కాయిన్ నిల్వ కలిగిన దేశంగా భారత్ స్థానం సంపాదిస్తుందా.. ఇప్పుడు ఈ ప్రశ్న దేశ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని అంచనాల ప్రకారం.. భారతీయులు కలిగి ఉన్న బిట్‌కాయిన్ మొత్తం దాదాపు 1 మిలియన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచ సరఫరాలో సుమారు 5 శాతం కంటే ఎక్కువ బిట్ కాయిన్ నిల్వలు ఇండియాలో ఉన్నాయని చెప్పవచ్చు. దీని విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు 120 బిలియన్ డాలర్ పై మాటగా చెప్పుకోవచ్చు.

భారత్ లో పెరుగుతున్న బిట్ కాయిన్ ఆకర్షణ: భారతదేశంలో బంగారంపై డిమాండ్ తగ్గి బిట్ కాయిన్ మీద ఆకర్షణ పెరుగుతోంది. పెట్టుబడిదారులంతా డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అనధికార సమాచారం ప్రకారం భారతీయులు కలిగి ఉన్న బిట్‌కాయిన్ మొత్తం దాదాపు 1 మిలియన్ పై మాటే. గ్లోబల్ వైడ్ గా చూసుకుంటే బిట్ కాయిన్ నిల్వలు సుమారు 5 శాతం భారతదేశంలోనే ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ గణాంకాలకు బ్లాక్‌చెయిన్‌పై నేరుగా ఆధారాలు లేకపోయినప్పటికీ ట్రెండ్స్ మాత్రం స్పష్టంగా ఉన్నట్లుగా చెబుతున్నాయి.
గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ లో భారత్ స్థానం: ఇక 2024లో విడుదలైన గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. Triple-A డేటా ప్రకారం చూస్తే.. ప్రస్తుతం 90 మిలియన్లకు పైగా భారతీయులు ఏదో ఒక రకమైన క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇది మొత్తం జనాభాలో సుమారు 8 శాతంకి సమానమని చెప్పుకోవచ్చు. భారతీయులు కలిగి ఉన్న క్రిప్టో పోర్ట్‌ఫోలియోలలో ఇప్పుడు బిట్‌కాయిన్ మొదటి స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎవరి చేతుల్లో ఉంది : అయితే ఈ క్రిప్టో హోల్డింగ్ సమానంగా విభజించబడలేదని ఎక్స్చేంజ్ డేటా చెబుతోంది. CoinDCX వంటి పెద్ద ఎక్స్చేంజ్‌లలో ట్రేడింగ్ వాల్యూమ్‌లో దాదాపు సగం కేవలం 3,500 మంది యూజర్ల నుంచే వస్తోంది. అంటే లక్షలాది రిటైల్ ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్ కలిగి ఉన్నా.. దాని ఆధిపత్యం మాత్రం HNIలు (High Net-Worth Individual), కుటుంబ కార్యాలయాలు, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు వంటి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది.
అంతా ప్లాన్ ప్రకారమే ..: రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా ఏం వస్తుందోనని ఊహించి పెట్టుబడులు పెడుతుంటారు. ఇందులో భాగంగానే వారు చిన్న మొత్తాల్లో బిట్‌కాయిన్ కొనుగోలు చేస్తుంటారు. కానీ HNIలు అలా కాదు. వారు తమ నికర సంపదలో 1 నుండి 5 శాతం వరకు బిట్ కాయిన్ మీద కేటాయిస్తున్నట్లుగా సమాచారం. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు, విదేశీ మార్కెట్ల యాక్సెస్, బిట్‌కాయిన్ ETF వంటి అవకాశాల ద్వారా వారు గ్లోబల్ నెట్‌వర్క్ ఎఫెక్ట్‌ను ముందుగానే అందిపుచ్చుకుంటారు.

గత 15 సంవత్సరాల నుంచి లాభాల్లోనే బిట్‌కాయిన్ : భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం ఒక పెద్ద ఆటంకం ఏంటంటే.. 31 శాతం పన్ను. ఇది లాభాలపై నేరుగా విధించబడుతుంది కాబట్టి... చాలామందికి దీర్ఘకాలిక హోల్డింగ్ కష్టతరం అవుతోంది. అయినప్పటికీ, గ్లోబల్ అనిశ్చితి, అమెరికా రాజకీయ మార్పులు, ట్రేడ్ వార్స్ వంటి అంశాలు బిట్‌కాయిన్‌ను వారు లాభాల ఆస్తిగా పరిగణిస్తున్నారు. గత 15 సంవత్సరాల్లో బిట్‌కాయిన్ అన్ని ప్రధాన అసెట్ క్లాసెస్ కంటే ఎక్కువ రాబడులు ఇవ్వడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
బిట్‌కాయిన్ కొనుగోలు రెండు విభిన్న శ్రేణులుగా: ఏది ఏమైనా భారతదేశంలో Bitcoin కొనుగోలు రెండు విభిన్న శ్రేణులుగా కొనసాగుతోంది. రిస్క్-రివార్డ్ విశ్లేషణతో కదిలే HNIలు ఒకటి కాగా.. కొత్తగా ఏదైనా చూసేద్దాం అనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు మరొకటి. ఈ రెండు వర్గాలు ఒకే దాని మీద వెళుతున్నా దారులు మాత్రం వేరేగా ఉన్నాయి. ఈ ఇద్దరూ భవిష్యత్తులో ఎవరు ఈ బిట్ కాయిన్ మార్కెట్‌ను నడిపిస్తారో చూడాలి. క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశ పెట్టుబడిదారులు బిట్ కాయిన్ మీద పెట్టుబడులు భారీగానే పెడుతున్నారు.
జూన్ లో రికార్డు స్థాయి ఇన్ ఫ్లో నమోదు : ఇక జూలై నెలలో బిట్‌కాయిన్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలను తాకిన సంగతి విదితమే. దీంతో భారతీయ పెట్టుబడిదారులు కూడా ఈ క్రిప్టో వైపు అడుగులు వేగంగా వేశారు. అగ్రశ్రేణి క్రిప్టో ఎక్స్చేంజీలు CoinDCX, Coinswitch, Mudrex, ZebPay లు కలిసి కేవలం ఏడురోజుల వ్యవధిలోనే సుమారుగా 150 నుంచి 200 మిలియన్ డాలర్ల నికర ఇన్‌ఫ్లోలను నమోదు చేశాయంటే దాని డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
CoinDCX నివేదిక ప్రకారం.. జూలై నెలలో రోజువారీ ట్రేడింగ్ వాల్యూమ్ జూన్‌లోని 9.17 మిలియన్ల నుంచి 40 శాతం పెరిగి 12.82 మిలియన్లకు చేరుకుంది. Coinswitch కూడా వారానికొకసారి ట్రేడింగ్‌లో 22 శాతం పెరుగుదల చూసింది, ముఖ్యంగా స్పాట్ ట్రేడింగ్ వాల్యూమ్‌లు 145 శాతం వరకు ఎగిసాయి. Mudrex గత వారం వాల్యూమ్‌లు రెట్టింపు అయినట్లు తెలిపింది. అందులో టైర్-2, టైర్-3 నగరాల నుంచి 40 శాతం వరకు ట్రేడింగ్ జరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ZebPay జూలై వారపు ట్రేడింగ్‌లో సగటున 75 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో బిట్‌కాయిన్, ఎథెరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటితో పాటుగా పెంగు, బనానాస్31 వంటి మీమ్ టోకెన్స్ కూడా రేసులోకి వచ్చాయి.
Mudrex CEO ఎడుల్ పటేల్ అంచనా ప్రకారం.. బిట్‌కాయిన్ త్వరలో 140,000 డాలర్లు దాటే అవకాశం ఉంది. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లు ఇంకా పూర్తి స్థాయిలో ఈ మార్కెట్లోకి రాలేదని, అందువల్ల మరింత వృద్ధికి అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఇదే సమయంలో CoinDCX గుప్తా మాత్రం పెట్టుబడిదారులకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. మాక్రో ఎకనామిక్ షాక్‌లు, లిక్విడిటీ తగ్గుదల, డెరివేటివ్స్ మార్కెట్ ఒత్తిళ్లు తాత్కాలిక అస్థిరతకు దారితీయవచ్చని సూచించారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications