ఆంధ్రాప్రదేశ్ ప్రజలు అమెరికా కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తీపికబురు అందించారు. తర్వలోనే విశాఖపట్టణం లేదా విజయవాడలో వీసా అప్లికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దింతో అమెరికాకు వెళ్లాలనుకున్న ఎపి ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు వీసా అప్లికేషన్ కోసం కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ, ఆంధ్రాప్రదేశ్ విభజన తరువాత ఏపీలో మొట్టమొదటి వీసా అప్లికేషన్ సెంటర్ రావడం గమనించదగ్గ విషయం.వీసా
అప్లికేషన్ సెంటర్ అంటే ఏమిటి
వీసా అప్లికేషన్ సెంటర్ అనేది ఇక్కడ మీ వీసా అప్లికేషన్ ఫార్మ్స్ స్వీకరిస్తారు. అంటే ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే అందుకు కావాల్సిన అప్లికేషన్ డాక్యూమెంట్స్, పేపర్ వర్క్ నిర్వహిస్తారు. ఈ ప్రాసెస్ కోసం మీరు ప్రైవేట్ వీసా కన్సల్టెంట్ ఆఫీసులకి వెళ్లాల్సిన పని లేదు. కానీ వీసా అప్రూవల్ కాన్సులర్ ఆఫీసర్ లేదా యుఎస్ ఎంబసీ నిర్ణయిస్తుంది. అలాగే ఇది అమెరికా వెళ్లాలనుకునే ప్రజలకు ప్రాసెసింగ్ సులభతరం చేయనుంది.

గత ఏడాది నుండి ఇప్పటివరకు చైనాను వెనక్కి నెట్టి అమెరికా యూనివర్సిటీలకు వెళ్తున్నప్రపంచ విద్యార్థులలో అగ్రదేశంగా భారత్ అవతరిస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి తెలుగువారే అత్యధికంగా ఉన్నారు. US కాన్సులేట్-జనరల్, హైదరాబాద్ నుండి వచ్చిన డేటా ప్రకారం గత సంవత్సరం USకి వెళ్లిన భారతీయ విద్యార్థులలో దాదాపు 56% మంది ఈ రెండు రాష్ట్రాల నుండే ఉన్నారు అందులో 34% మంది తెలంగాణ నుండి, 22% మంది ఆంధ్రా నుండి ఉన్నారు.
అలాగే భారతీయ విద్యాసంస్థల్లో చేరిన US విద్యార్థుల సంఖ్య గత సంవత్సరం కంటే 300% పెరిగింది.ఈ వివరాలను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్, ప్రజా వ్యవహారాల అధికారి అలెగ్జాండర్ మెక్‌లారెన్ మంగళవారం విశాఖపట్నం పర్యటనలో వెల్లడించారు. అయితే తెలంగాణ, ఆంధ్రా నుండి ఖచ్చితమైన విద్యార్థుల సంఖ్యను వెల్లడించనప్పటికీ 2023లో భారతదేశం దాదాపు 3.3 లక్షల మంది విద్యార్థులను యుఎస్‌కు పంపగా అందులో దాదాపు 1.8 లక్షలు ఉండొచ్చు.
"భారతదేశంలో US వీసాల డిమాండ్ తృప్తి చెందట్లేదు. గత సంవత్సరం మేము 1.4 మిలియన్ల వీసాలను ప్రాసెస్ చేసాము. ఇది జనాభాలో పదో వంతు మాత్రమే అయినప్పటికీ భారతదేశంలో పనిచేస్తున్న ఏ ఇతర దేశం (కాన్సులేట్) ఇన్ని వీసాలను ప్రాసెస్ చేయలేదు. గత ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో మా స్టాఫ్ రెండింతలు పెరిగారు. 2025 ప్రారంభంలో ఈ స్టాఫ్ దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని మేము భావిస్తున్నాము. ప్రస్తుతం మేము రోజుకు 1,600 వీసాలను ప్రాసెస్ చేస్తాము, ఈ సంఖ్యా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దాదాపు 2,500కి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత ఎక్కువ పెరగవచ్చు " అని రెబెకా డ్రేమ్ అన్నారు.
హైదరాబాద్ కాన్సులేట్ 2024 సమ్మర్ స్టూడెంట్ వీసా సీజన్‌లో 47,000 స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిర్వహించింది, అయితే అంతకుముందు ఏడాది 2023తో పోల్చితే 35,000 నుండి పెరిగింది. ప్రజా వ్యవహారాల అధికారి మెక్‌లారెన్ సోమవారం విడుదల చేసిన US ఓపెన్ డోర్స్ రిపోర్ట్ వెల్లడిస్తూ భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదలను హైలైట్ చేసింది. "ఈ సంవత్సరం అమెరికాకు విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. చాలా మంది భారతీయ విద్యార్థులలో పురుషులు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్తుండగా అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో రిజిస్ట్రేషన్స్ పెరగవచ్చు" అని మెక్‌లారెన్ చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications