Free Petrol: ఇంధన ధరలు పెరుగుతున్న తరుణంలో ఉచితంగా పెట్రోల్ వస్తుందంటే ఎవరైనా కాదంటారా. అంతర్జాతీయంగా మార్కెట్లలో క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ అవి దేశాయ వాహనదారులకు అందుబాటులోకి రావటం లేదు. కానీ ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే దొరికే అనేక ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

పెట్రో ధరల సెంచరీలు..
పెట్రోలు ధరలు ఇప్పటికే సెంచరీని దాటేయటం.. డీజిల్ ధరలు సైతం అదే మార్గంలో ప్రయాణించటం వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వారికి ఫ్యూయల్ కార్డ్ అందించే ప్రయోజనాలు కొంత ఉపసమనాన్ని అందిస్తున్నాయి. ధరల భారంలోనూ కొంత ఉపసమనాన్ని అందిస్తున్నాయి.

ఉచితంగా పెట్రోల్..
సిటీ బ్యాంక్ అందిస్తున్న Indianoil citi Credit Card వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. దీనిని వినియోగించే వారికి ఏడాదికి ఉచితంగా 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ లభిస్తుంది. ఇందుకోసం బ్యాంక్ దేశీయ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదర్చుకుంది. అంటే కార్డు వినియోగదారులు నెలకు సుమారు 5 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చు.

అసలు ప్రక్రియ ఏమిటంటే..
సిటీ బ్యాంక్ ఫ్యూయల్ కార్డ్ కలిగి ఉన్న వాహనదారులు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో రూ.150 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తే వారికి 4 టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇక గ్రాసరీస్ షాపింగ్ చేసినప్పుడు 2 పాయింట్లను పొందుతారు. అలాగే ఇతర ట్రాన్సాక్షన్లపై ప్రతి రూ.150 ఖర్చుచేసినప్పుడల్లా ఒక్క పాయింట్ పొందుతారని బ్యాంక్ తెలిపింది. దీనికి అదనంగా ఇంధన సర్ ఛార్జ్ లో ఒక శాతం మినహాయింపు కూడా లభిస్తుంది. ఏడాది మెుత్తంలో వచ్చిన ఈ పాయింట్లను వినియోగించి 68 లీటర్ల ఇంధనాన్ని ఉచితంగా పొందవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది.

మార్కెట్లో మరిన్ని కార్డులు..
ఇదే తరహాలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, స్టాండర్డ్ ఛార్టర్డ్, యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న ఆయిల్ కార్డ్స్ సైతం వినియోగదారులకు మంచి ఆఫర్లను అందిస్తూ కస్టమర్లపై పెట్రో భారాన్ని తగ్గిస్తున్నాయి.


Click it and Unblock the Notifications