For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sushmita Shukla: ముంబై టూ అమెరికా.. ఫెడ్ తొలి భారత సీఓఓగా సుస్మితా శుక్లా రికార్డు.. అసలు ఎవరు ఈమె..?

|

Sushmita Shukla: ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదటి వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(COO)గా భారతీయ సంతతికి చెందిన సుస్మితా శుక్లా నియమితులై రికార్డు సృష్టించారు. శుక్లా 2023 నుంచి ఈ బాధ్యతులు చేపట్టనున్నారు. దీనికి ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ గవర్నర్ల బోర్డు కూడా ఆమోదం తెలిపింది.

భారతీయ మహిళ

భారతీయ మహిళ

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సీఓఓగా భారతీయ సంతతికి చెందిన సుస్మితా శుక్లాను సెలెక్ట్ చేయటం గమనార్హం. దీంతో ఆమె ఫెండ్ రెండవ అత్యున్నత అధికారిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఈమె ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీకి ప్రత్యామ్నాయ ఓటింగ్ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తారు.

సుస్మితా శుక్లా ఎవరు..?

సుస్మితా శుక్లా ఎవరు..?

జనవరి 2018 నుంచి సుస్మితా శుక్లా న్యూయార్క్ నగరంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్తి, ప్రమాద బీమా సంస్థ అయిన చుబ్‌లో పని చేస్తున్నారు. ఆమె చబ్‌లోని ఇంటర్నేషనల్ యాక్సిడెంట్ అండ్ హెల్త్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఈ సంస్థకు 51 దేశాల్లో వ్యాపారం ఉండగా.. అందుకు అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు, క్లెయిమ్ టెక్నాలజీకి ఆమె నాయకత్వం వహించారు.

హెల్త్‌ఫస్ట్ కంపెనీ..

హెల్త్‌ఫస్ట్ కంపెనీ..

శుక్లా గతంలో హెల్త్‌ఫస్ట్‌లో పనిచేశారు. అక్కడ 2016లో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత 2017లో ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగానికి తాత్కాలిక సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. దీనికి ముందు ఆమె ది హార్ట్‌ఫోర్డ్‌లో 10 ఏళ్లు గడపగా.. మెర్రిల్ లించ్, లిబర్టీ మ్యూచువల్, జెయింట్‌బేర్ ఇంక్‌లో కూడా పనిచేశారు.

ముంబై నుంచి అమెరికాకు..

ముంబై నుంచి అమెరికాకు..

ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన శుక్లా.. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్ అండ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. డైనమిక్ లీడర్ గా ఉన్న ఆమె నాయకత్వం, విస్తృత అనుభవం బ్యాంక్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్, CEO జాన్ సి విలియమ్స్ అన్నారు. శుక్లాకు సాంకేతిక పరిజ్ఞానం మరియు చురుకైన ఇన్నోవేషన్ మెథడాలజీల గురించి లోతైన పరిజ్ఞానం ఉందని ఆయన అన్నారు. అయితే తనకు ఈ పనిచేసే అవకాశం లభించటం గౌరవంగా భావిస్తున్నానని సుస్మితా శుక్లా అన్నారు.

English summary

Sushmita Shukla: ముంబై టూ అమెరికా.. ఫెడ్ తొలి భారత సీఓఓగా సుస్మితా శుక్లా రికార్డు.. అసలు ఎవరు ఈమె..? | Indian Women Sushmita Shukla appointed as COO of Newyork Federal Reserve Bank

Indian Women Sushmita Shukla appointed as COO of Newyork Federal Reserve Bank
Story first published: Saturday, December 10, 2022, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X