Gold: నిజంగా భారతదేశంలో చాలా బంగారం ఉంది. విదేశీయులు అనేక సార్లు దండెత్తి వేల టన్నుల బంగారాన్ని దోచుకెళ్లినప్పటికీ ఇండియాలో గోల్డ్ భారీగానే ఉంది. 1739లో పెర్షియన్ పాలకుడు నాదిర్ షా, అతనితో పాటు బ్రిటిషర్లు తమ దేశాలకు చాలా బంగారాన్ని తీసుకెళ్లారు. ఇంత జరిగినప్పటికీ దేశంలోని ప్రజలు, బ్యాంకులు, లాకర్లు, సేఫ్ లలో ఉన్న టన్నుల కొద్దీ బంగారం చాలా దేశాల జీడీపీ కంటే ఎక్కువగానే ఉంది.

మహిళల వద్ద స్వర్ణం..
భారతీయ మహిళలు తమ వద్ద బంగారం ఉంచుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ఇప్పుడు ఈ విషయంపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడైంది. నివేదిక ప్రకారం భారతీయ మహిళల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ బంగారం విలువ అక్షరాలా రూ.107 లక్షల కోట్లని వెల్లడైంది. ఇంత బంగారం ఉన్నప్పటికీ భారతీయులు ఇంకా బంగారాన్ని కొంటూనే ఉన్నారు. ఈ భారీ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు వ్యాపారులు ఇతర దేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేసుకుంటున్నారు.

గోల్డ్ నిల్వలు..
ప్రపంచంలో అనేక దేశాల బంగారం నిల్వల కంటే ఇండియాలో ఎక్కువగా బంగారం ఉంది. 2021 లెక్కల ప్రకారం చైనా దగ్గర దాదాపు 673 టన్నుల గోల్డ్ ఉంది. భారతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే అక్షర తృతీయ రోజు 40 టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాల కంటే భారతీయ మహిళల వద్ద ఎక్కువ బంగారం ఉందని వెల్లడైంది.

పాకిస్థాన్ జీడీపీ..
భారత మహిళల బంగారంలో పాకిస్థాన్ జీడీపీ మూడో వంతు కావటం గమనార్హం. ప్రస్తుతం పొరుగు దేశం పాక్ పరిస్థితి ఆర్థికంగా దయనీయంగా మారింది. ఈ క్రమంలో వాస్తవంగా అక్కడ బంగారం నిల్వలు ఎంత ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. 2021-22లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వద్ద 8133.47 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ వద్ద 3358.50 టన్నులు, రష్యా సెంట్రల్ బ్యాంక్ వద్ద 2301.64 టన్నులు, చైనా సెంట్రల్ బ్యాంక్ వద్ద 1948 టన్నుల బంగారం ఉండగా.. ఆర్‌బీఐ వద్ద 760.40 టన్నుల బంగారం ఉంది.

బంగారంతో లాభాలు..?
వాస్తవానికి బంగారం నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశ కరెన్సీ బలంగా ఉంటుంది. ఇది సదరు దేశ దిగుమతి-ఎగుమతిని సులువుగా మారుస్తుంది. ఎక్కువ వాణిజ్యం ఉంటే.. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. ఇది దేశ జీడీపీపై సానుకూల ప్రభావం చూపుతుంది. భారతీయులు తమ ఇళ్లలో ఉంచుకునే బంగారం మొత్తం దేశ జీడీపీలో 45 శాతం కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications