UPI News: భారత దేశంలో విస్తృతంగా వ్యాపించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఇండియా ప్రపంచవ్యాప్తం చేస్తోంది. తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండేలా ఎన్పీసీఐ చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలోని పక్కనే ఉన్న శ్రీలంక సైతం భారత యూపీఐ చెల్లింపుల విధానాన్ని స్వీకరించేందుకు సిద్ధమైంది. భారతదేశం తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని ఫిబ్రవరి 12, 2024న ప్రారంభించనున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య యూపీఐ చెల్లింపు గేట్‌వేపై సంతకం చేయబడినట్లు వెల్లడించారు. ఇరు దేశాల నాయకులు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవుతారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది తమ దేశంలో పర్యాటకాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుందని అన్నారు.

యూపీఐ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ద్వారా అభివృద్ధి చేయబడిన ఫాస్టెస్ట్ రియల్ టైం చెల్లింపు వ్యవస్థ. ఇంటర్‌ఫేస్ ఇంటర్-బ్యాంక్ పీర్-టు-పీర్, పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలను ఇది మరింత సులభతరం చేస్తుంది. హిందూ మహాసముద్ర సదస్సులో పాల్గొనేందుకు పెర్త్‌లో ఉన్న అలీ సబ్రీ.. తమ దేశంలో భారత్ ఐఐటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇప్పటికే శ్రీలంక నుంచి ప్రతినిధి బృందం ఐఐటి మద్రాస్‌ను సందర్శించిందని మంత్రి పేర్కొన్నారు. శ్రీలంకలో ఐఐటి క్యాంపస్‌ను స్థాపించే అవకాశం గురించి కొంత చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను యూరోపియన, అరబ్ దేశాలు సైతం ఆహ్వానించాయి. ఇది విదేశాల్లో పర్యటను వెళ్లే భారతీయులకు చెల్లింపుల్లో వెసులుబాటును కలిగిస్తుంది. చాలా దేశాలు ఇప్పటికే ఈ విధానంలోని ఉపయోగాలను గుర్తించి భాగస్వాములుగా మారేందుకు ముందుకొస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications