IT news: గూగుల్ మెచ్చిన భారతీయుడు.. కంపెనీ ఎంత రివార్డు ఇంచ్చిందంటే..
IT news: ఐటీ రంగం వృద్ధి, పెరుగుతున్న సాంకేతికత వెరసి మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ప్రతి విషయానికీ సాఫ్ట్ వేర్లు, యాప్ లపై ఆధారపడి బతుకుతున్నాం. అయితే వాటిని తయారు చేసేది కూడా సాధారణ మానవుడే. వాటిలో కొన్ని పొరపాట్లు, భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదాలు కావాలని చేయకపోయినా తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. సంబంధిత సంస్థలు వాటిని గుర్తించి, సాధ్యమైనంత త్వరగా సరి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలా యాప్ లు, సాఫ్ట్వేర్లలో వల్నారిటీలను గుర్తించే పద్ధతిని 'బగ్ బౌంటీ' అంటారు. వాటిపై పరిశోధించి, గుర్తించే వారిని బగ్ హంటర్స్ అంటారు.

ఇండియన్సే టాప్:
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కు సంబంధించిన బగ్ బౌంటీలో 700 మందికి పైగా పాల్గొన్నట్లు కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. రికార్డ్ స్థాయిలో 12 మిలియన్ డాలర్ల విలువైన బహుమతులను పరిశోధకులు గెలుచుకున్నట్లు వెల్లడించారు. బగ్ బౌంటీ చరిత్రలో ఇదే అతి పెద్ద రివార్డుగా పేర్కొన్నారు ఈ మొత్తంలో ఎక్కువ భాగాన్ని భారతీయలే సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు.

భారతీయుడి వీరవిహారం:
వల్నారిటీ రివార్డు ప్రోగ్రాం(VRP) ఆండ్రాయిడ్ విభాగానికి 4.8 మిలియన్ డాలర్ల రివార్డులు అందించి గూగుల్ రికార్డు నెలకొల్పింది. సంస్థ VRP చరిత్రలో ఓ నివేదిక కోసం ఏకంగా 6 లక్షల 5 వేల డాలర్లు చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ VRPకి సంబంధించి 200కు పైగ వల్నారిటీలను గుర్తించిన అమన్ పాండే ఈ ప్రోగ్రాంలో టాప్ పరిశోధకుడిగా నిలిచినట్లు గూగుల్ రివార్డ్ టీమ్ కు చెందిన శారా జకోబస్ తెలిపారు. 2019లో మొదటిసారిగా తన నివేదికను సమర్పించినప్పటి నుంచి దాదాపు 500 బగ్స్ ను ఆయన సంస్థ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు.

సెక్యూరిటీ ఇష్యూస్ కోసం భారీగా..
ఆండ్రాయిడ్ చిప్సెట్ సెక్యూరిటీ రివార్డు ప్రోగ్రాం 2022కి సంబంధించి 4 లక్షల 86 వేల డాలర్లను గూగుల్ అందించింది. 700 కి పైగా వ్యాలీడ్ భద్రతా నివేదికలను అంగీకరించింది. క్రోమ్ VRP లోనూ 470 చెల్లుబాటయ్యే ప్రత్యేక భద్రతా ఉల్లంఘనలు గుర్తించింది. ఇందుకోసం నాలుగు మిలియన్ డాలర్లను రివార్డుల కోసం ఖర్చు చేసింది. ఇందులో ఒక్క క్రోమ్ బ్రౌజర్ గురించిన 363 నివేదికల కోసమే 3.5 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు పేర్కొంది. క్రోప్ OSలో 110 సెక్యూరిటీ ఇష్యూస్ రిపోర్టు చేసినందుకు మొత్తంగా 5 లక్షల డాలర్లు బహుమతులు ఇచ్చినట్లు తెలియజేసింది.

భారీగా గ్రాంట్:
గతేడాది ఆగస్టులో తమ ఓపెన్ సోర్స్ ప్రొజెక్ట్స్ లో వల్నారిటీలను గుర్తించడానికి VRP రివార్డ్ ప్రోగ్రామును గూగుల్ ప్రారంభించింది. ఇందులో 100 మందికి పైగా పాల్గొని.. లక్షా 10 వేల డాలర్స్ గెలుచుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదికాక మరో 170 మంది భద్రతా పరిశోధకులకు 2 లక్షల 50 వేల డాలర్స్ గ్రాంట్ గా అందించినట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications