నిన్న జరిగిన ముహురత్ ట్రేడింగ్ సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని లాభాలను అందించాయి. అయితే ముందే ఊహించిన విధంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో అలుముకున్న రుణ సంక్షోభం కారణంగా మూడీస్ రేటింగ్ సంస్థ యూఎస్ రేటింగ్ తగ్గించటం ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అగ్రరాజ్యం గ్లోబల్ మార్కెట్లను ప్రతీకూలంగా ప్రభావితం చేస్తోంది. గతంలోనూ ఫిచ్ రేటింగ్స్ ఇదే తరహాలో రేటింగ్ తగ్గించటం మార్కెట్లకు హెచ్చరికగా నిలిచింది.

ఉదయం 9.32 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 297 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 81 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 201 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 178 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, హిందాల్కొ, బీపీసీఎల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు ప్రధానంగా లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, సిప్లా, విప్రో, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, టాటా మోటార్స్ సహా ఇతర స్టాక్స్ నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications