Vi Recharge Plans: గతంలో వచ్చిన కథనాలకు అనుగుణంగా దేశీయ టెలికాం ఆపరేటింగ్ కంపెనీలు తమ కస్టమర్లపై ధరల భారాన్ని పెంచుతున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు తమ టారిఫ్ హైక్స్ ప్రకటిస్తాయని గతంలో వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ముందుగా రేట్ల పెంపును అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రారంభించగా మిగిలిన కంపెనీలు అదే దారిలో నడుస్తున్నాయి.
నిన్న ఎయిర్‌టెల్ నిన్న రేట్ల పెంపును ప్రకటించగా నేడు మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడఫోన్ ఐడియా టారిఫ్ రేట్ల పెంపును ప్రకటించింది. దీంతో కంపెనీ మూడేళ్ల తర్వాత తొలిసారిగా టారిఫ్‌లకు దిగింది. 5G టెక్నాలజీ సేవల కోసం Jio, Airtel గత రెండేళ్లలో వేల కోట్లు పెట్టుబడి పెట్టగా, దానిని తిరిగి పొందేందుకు తాజాగా టారిఫ్ పెంపులను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ పెంపులు కంపెనీలకు యావరేజ్ రెవెన్యూ ఫ్రమ్ యూజర్స్ పెరుగుతుందని ఇన్వెస్టర్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఈ సొమ్మును తమ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వినియోగిస్తాయని తెలుస్తోంది.

ప్రస్తుత రౌండ్ టారిఫ్ పెంపులో భారతీ ఎయిర్‌టెల్ 10-21 శాతం, రిలయన్స్ జియో 13-27 శాతం మేర టారిఫ్‌లను పెంచాయి. ఇక చివరిగా వోడాఫోన్ ఐడియా జూలై 4 నుంచి తన టారిఫ్ రేట్లను 17 ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై 10% నుంచి 23% మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 28 రోజుల చెల్లుబాటు అయ్యే బేసిక్ ప్లాన్ ధర రూ.179 నుంచి రూ.199కి పెరిగింది. అలాగే కంపెనీ 84 రోజుల చెల్లుబాటుతో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్ ధర గతంలో రూ.719 నుంచి రూ.859కి పెంచబడింది. ఈ ప్లాన్ రోజుకు 1.5 GB ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది.
వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్ ధర రూ.2,899 నుండి రూ.3,499కి అంటే దాదాపు 21% పెరిగింది. దీని తరువాత 24GB డేటా పరిమితి, 365 రోజుల చెల్లుబాటుతో ఉన్న ప్లాన్ ప్రస్తుత ధర రూ.1,799 వద్ద మారదు. భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం సబ్‌స్క్రైబర్ మార్కెట్ అయినప్పటికీ ఇప్పటికీ తక్కువ టారిఫ్ రేట్లను వసూలు చేస్తున్నాయి. భారతీయ టెలికాం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే లక్ష్యంతో రంగంలోకి దిగిన జియో, ఉచిత ప్లాన్‌ల నుంచి తక్కువ-ధరకు సేవలను అందించటం వరకు చందాదారులను ఆకర్షించే వ్యూహాన్ని ప్రారంభంలో అనుసరించింది.
జియో నుంచి వ్యాపార యుద్ధాన్ని తట్టుకునేందుకు తోటి టెలికాం సర్వీస్ కంపెనీలు పోటీని తట్టుకునేందుకు టారిఫ్ లను తగ్గించడమే కాకుండా సొంతంగా టారిఫ్ లను పెంచుకోలేని దుస్థితిని ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితిలో ఎయిర్‌టెల్ టారిఫ్‌ల పెంపుకు పిలుపునిచ్చింది. దానితో అన్ని ప్రముఖ కంపెనీలు టారిఫ్‌లను పెంచాయి. 2021 నుంచి టారిఫ్ పెంచని టెలికాం సర్వీస్ కంపెనీలు తాజా ధరల పెంపుకు దిగాయి. ఈ ధరల పెంపులు కంపెనీల షేర్లపై సానుకూలతను పెంచనున్నాయి. సోమవారం మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీల షేర్లు భారీగా లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications