TCS News: చాలా కాలంగా కొనసాగుతున్న గడ్డు పరిస్థితుల ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం టెక్ రంగంలో మెల్లగా బయటకు వస్తున్నాయి. దీంతో దేశంలోని టెక్కీలకు వరుసగా కంపెనీలు తమ కఠినత్వాన్ని చూపిస్తున్నాయి.
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ TCS లాభాలను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వ్యాపార పరిస్థితుల్లో కొత్త వ్యాపార డీల్స్ గెలవలేకపోవటం.. కొత్త సాంకేతికతలో అధిక-నాణ్యత సేవను అందించడానికి సిబ్బంది కొరత వంటి ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నియామకాలు అనే మాట అస్సలు ఇండస్ట్రీలో వినిపించటం లేదు.

విదేశాల్లో పనిచేస్తున్న మిడ్ లెవల్ ఉద్యోగులను తొలగిస్తూ విప్రో తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు మిన్నంటాయి. అయితే ఇప్పుడు టీసీఎస్ నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇప్పటి వరకైతే TCS ఇంకా ఎటువంటి తొలగింపులను ప్రకటించనప్పటికీ.. ప్రతి త్రైమాసికంలో దాని ఉద్యోగుల సంఖ్య తగ్గటం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు ఇచ్చే జీతాల పెంపు, ప్రమోషన్లపై టీసీఎస్ వెనకడుగు వేసింది.
చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్న విషయం ఏమిటంటే.. TCS జీతం పెంపును వేరియబుల్ పేతో అనుసంధానిస్తూ రిటర్న్-టు-ఆఫీస్ ప్రాక్టీస్‌ను ప్రకటించింది. టీసీఎస్ ఇటీవల యూనిట్ హెడ్‌లు తమ తమ గ్రూపులకు గ్రేడింగ్‌లు నిర్వహించింది. ప్రమోషన్లు దీని ఆదారంగానే జరుగుతుంటాయి. అయితే వీటిని ఇవ్వాలంటే ప్రతి ఉద్యోగి కార్యాలయ హాజరు ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతోంది. అంటే ఆఫీస్ వర్కింగ్ డేస్‌లో టీమ్ అవసరాన్ని బట్టి ఆఫీసుకు వచ్చారా లేదా అనే విషయం ఆధారంగా గ్రేడ్ ఇస్తారు.
టీసీఎస్ తన ఉద్యోగుల జీతం పెంపు, వేరియబుల్ పే, ప్రమోషన్‌లను లింక్ చేయడానికి రిటర్న్-టు-ఆఫీస్ స్కీమ్‌ను ఉపయోగిస్తోంది. అలాగే కంపెనీ స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఇచ్చిన కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు రివార్డులు అందజేస్తోంది. ఇది అదనపు ఆదాయాన్ని సంపాదించటానికి రూ.3 లక్షలకు మించి అవకాశాన్ని కల్పిస్తోంది.


Click it and Unblock the Notifications