అమెరికా కల చెదిరింది.. చేతిలో H1B వీసా ఉన్నా రోడ్డున పడ్డ ఇండియన్ టెక్కీ.. గుండె బరువెక్కించే కథ!

ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వడం, అమెరికా వెళ్లడం అనేది చాలా మంది యువకుల కన్న కల. కానీ, అక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఒక 26 ఏళ్ల భారతీయ యువ టెక్కీ. అమెరికాకు వెళ్ళాడు, ఎంతో కష్టపడి చదివాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు. కానీ చివరకు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు), వీసా కష్టాల వల్ల సర్వస్వం కోల్పోయి, ఖాళీ చేతులతో, అప్పులతో ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ నడుస్తోంది.

Indian Techie Losing H1B Visa Forced To Return To India Post Layoff Asks How To Start Over

మాస్టర్స్ డిగ్రీ నుంచి H1B సంబరాల వరకు..

ఈ యువకుడు 2021లో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి కాగానే ఒక మంచి స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతని అదృష్టం బాగుండి మొదటి ప్రయత్నంలోనే వీసా (H1B visa) లాటరీలో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ సంతోషంలో ఒక కొత్త కారు కొనుక్కున్నాడు, ఒక పెంపుడు కుక్కను కూడా తెచ్చుకున్నాడు. వేరే పెద్ద కంపెనీల్లో ఎక్కువ జీతానికి ఆఫర్స్ వచ్చినా, తనకు లైఫ్ ఇచ్చిన సీఈఓ పై కృతజ్ఞతతో అదే స్టార్టప్‌లో ఉండిపోయాడు. కానీ, అదే అతను చేసిన పెద్ద తప్పవుతుందని ఊహించలేదు.

జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క లేఆఫ్!

ఆ కంపెనీలో H1B వీసా స్టేటస్ మారిన కేవలం నాలుగు నెలలకే అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సంక్షోభం కారణంగా కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. సాధారణంగా H1B వీసా ఉన్నవాళ్లకు ఉద్యోగం పోతే వేరే జాబ్ వెతుక్కోవడానికి ప్రభుత్వం కేవలం 60 రోజుల సమయం (Grace Period) ఇస్తుంది. ఈ 60 రోజుల్లో అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. వీసా రూల్స్ ప్రకారం లీగల్‌గా అక్కడే ఉండటానికి విజిటర్ వీసా (B-2)కి అప్లై చేశాడు.

కోర్టు నోటీసులు, మానసిక క్షోభ

కానీ, దురదృష్టం అతన్ని వదల్లేదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ నుంచి అతనికి 'నోటీస్ టు అప్పియర్' వచ్చింది. అంటే కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు నెలల పాటు నరకం చూశాడు. సంపాదించిన డబ్బంతా లాయర్లకు, కోర్టులకే సరిపోయింది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ ఎక్కువయ్యాయి. చివరికి ఆ కేసులో నెగ్గినా, అప్పటికే అతని జీవితం అతలాకుతలమైపోయింది.
ఆ తర్వాత ఎలాగోలా ఇంకో ఉద్యోగం దొరికింది. ఇక అంతా బాగుంటుంది అనుకునే లోపు, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అవ్వడంతో అతని కొత్త కంపెనీ వీసా పేపర్స్ సకాలంలో సబ్మిట్ చేయలేకపోయింది. దీనికి తోడు ఇమ్మిగ్రేషన్ పాలసీలు మారడంతో అతని అప్లికేషన్ మరింత ఆలస్యమైంది.

ఒక్క రోజులోనే అంతా తలకిందులు..

ఈ కష్టాలన్నీ పడుతూ దాదాపు 18 నెలల పాటు తీవ్ర ఆందోళనలో గడిపాడు. రెండు రోజుల క్రితం అతని విజిటర్ వీసా అప్రూవ్ అయిందని మెసేజ్ వచ్చింది. దాంతో అబ్బా.. ఇప్పటికైనా చిన్న ఆశ కిరణం కనిపించింది అనుకున్నాడు. కానీ, అంతలోనే మరుసటి రోజే పెద్ద బాంబ్ పేలింది. అతని వీసా ఎక్స్టెన్షన్ అప్లికేషన్‌ను ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. అంతేకాదు, వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆర్డర్ వేసింది.

అప్పులతో ఇండియాకు.. మళ్ళీ సున్నా నుండి..

సరిగ్గా కొడుకును చూడటానికి అతని తల్లిదండ్రులు వీసా తీసుకున్న మరుసటి రోజే ఈ దారుణం జరగడం గమనార్హం. ఇప్పుడు ఆ యువకుడు తన కారును, ఇంట్లోని వస్తువులన్నింటినీ తక్కువ ధరకే అమ్మేసి ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాడు. 5 ఏళ్లు అమెరికాలో ఉండి భారీగా సంపాదిస్తాడు అనుకుంటే, ఇప్పుడు చేతిలో రూపాయి లేదు సరే సదా.. నెత్తిన స్టూడెంట్ లోన్ అప్పులు ఉన్నాయి.
"నేను పూర్తిగా ఓడిపోయాను. నా జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను బతకడానికి కారణం నా కుక్క మాత్రమే. అది లేకపోతే నేను ఏం చేసేవాడినో నాకే తెలియదు" అని అతను ఎంతో భావోద్వేగంతో రాసుకొచ్చాడు.

అయితే ఈ పరిస్థితికి అతను ప్రభుత్వాన్ని గానీ, కంపెనీని గానీ బ్లేమ్ చేయడం లేదు. తనలోని లోపాల వల్లే ఇలా జరిగిందేమో అని తనే బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ టెక్కీ స్టోరీ ఐటీ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది వీసా (H1B visa) హోల్డర్ల భయాలను, వాస్తవాలను కళ్లకు కడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+