అగ్రరాజ్యం అమెరికాలో ఎంఎస్ చేస్తే చాలు జీవితం పూర్తిగా మారిపోతుంది.. డాలర్లలో జీతం... స్థిరమైన భవిష్యత్తు... కుటుంబం తలెత్తకునేలా జీవించడం... ఇలా అనేక రకాలైన కలలతో వేలాది మంది భారతీయ విద్యార్థులు ప్రతి ఏటా అమెరికాకు పయనమవుతున్నారు. అయితే ఆ కలలు ఇప్పుడు వాస్తవంలో సాధ్యం కావడం లేదు. వీసా పరిమితులు, ఐటీ రంగంలో మందగమనం, ఉద్యోగ అవకాశాల కొరత... ఇవన్నీ కలసి అమెరికాలో చదువుకున్న భారతీయ టెక్కీలను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తాజాగా ఒక భారతీయ టెక్కీ పంచుకున్న అనుభవం ఈ చేదు నిజాన్ని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.
కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన ఆ యువ నిపుణుడు.. కోటి ఆశలతో ఒక పేరున్న ఎంఎన్‌సీ కంపెనీలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌గా పనిచేశాడు. అజూర్, ఎస్‌క్యూఎల్ వంటి కీలకమైన టెక్నాలజీలపై ప్రాజెక్టులు చేశాడు. ఇంటర్న్‌షిప్ అయిపోగానే ఫుల్‌టైమ్ ఆఫర్ వస్తుంది... అప్పుడైనా జీవితం సెట్ అవుతుందని గట్టిగా నమ్మాడు. అయితే ఆ ఆఫర్ వచ్చినప్పుడు Indian Techie ఆశలన్నీ ఒక్కసారిగా అడియాశలయ్యాయి.

ఇంటర్న్‌గా పొందుతున్న జీతం కంటే గంటకు కేవలం మూడు డాలర్లు మాత్రమే పెంచుతామని కంపెనీ చెప్పింది. అంటే ఎంఎస్ డిగ్రీ, ఖరీదైన విద్యా రుణాలు, సంవత్సరాల కష్టానికి విలువ కేవలం రూ.250 మాత్రమే అన్నట్లుగా అతనికి అనిపించింది. అంతేకాదు, హెచ్1బీ వీసా స్పాన్సర్‌షిప్ కూడా ఇవ్వబోమని స్పష్టంగా చెప్పేశారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా ఎదగాలనుకున్న అతనికి, బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్ అనే పాత్రను ఆఫర్ చేయడం మరో పెద్ద దెబ్బగా మారింది. ఈ రోల్‌తో నా కెరీర్ ఎటు పోతుంది? భవిష్యత్తులో నేను కోరుకున్న స్థాయికి చేరగలనా?" అన్న ప్రశ్నలు అతన్ని వెంటాడుతున్నాయి.
ఈ అనుభవాన్ని అతడు రెడ్డిట్‌లో పంచుకున్నప్పుడు.. ఆ మాటల్లో నిరాశ, కోపం, అసహాయం అన్నీ స్పష్టంగా కనిపించాయి.ఎంఎస్ చేసిన వ్యక్తికి గంటకు మూడు డాలర్లు పెంచడం అంటే నా నైపుణ్యాన్ని అవమానించినట్టే. ఇక్కడ ఉండటం వృథా అనిపిస్తోంది. ఇండియాకి తిరిగి వెళ్లిపోవాలనిపిస్తోందని అతడు ఆవేదనతో రాశాడు. విదేశాల్లో ఉన్నప్పటికీ, తన కష్టానికి విలువ లేదన్న భావన అతని మనసును పూర్తిగా విరిచేసింది.
ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాస్తవికంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ చాలా చెడు దశలో ఉంది. 15-20 ఏళ్ల అనుభవం ఉన్నవారికే ఉద్యోగాలు రావడం లేదు. కాబట్టి చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మరికొందరు జీతం తక్కువైనా సరే, అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు ఉద్యోగం అవసరం. పరిస్థితులు మారే వరకు ఓపిక పట్టాలని అంటున్నారు. ఇంకొందరు మాత్రం ఇండియాకి తిరిగి వెళ్లడం తప్పు కాదు, కానీ అక్కడ కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా, చేతిలో ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కథ ఒక్క వ్యక్తిదే కాదు. ఇది అమెరికాలో చదివి, అక్కడే స్థిరపడాలని కలలు కన్న అనేక మంది భారతీయ విద్యార్థుల మనసుల్లో దాగి ఉన్న భయానికి ప్రతిబింబంగా చెప్పవచ్చు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Labour code: కొత్త లేబర్ కోడ్! 50% బేసిక్ పే రూల్‌తో మీ జీతం ఎలా మారబోతోంది? పూర్తి వివరాలు!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications