Tech Stocks: దేశీయ స్టాక్ మార్కెట్ల నిన్నటి లాభాలను ఐటీ కంపెనీల షేర్లు నేడు ఆవిరి చేశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచి టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలటంతో పరిస్థితి తారుమారైంది. ఇన్వెస్టర్లు ఈ కంపెనీల్లో అమ్మకాలకు దిగారు.
వాస్తవానికి యాక్సెంచర్ తన ఆర్థిక 2024 ఆదాయ అంచనాను తగ్గించిన ఒక రోజు తర్వాత.. టెక్ రంగంలో డిమాండ్ రికవరీ పుంజుకుంటుందనే ఆశలు తగ్గాయి. దీంతో ఇన్నాళ్లుగా ఆశగా ఎదురుచూసిన ఇన్వెస్టర్లు టెక్ కంపెనీల్లో తమ పెట్టుబడులను వదులుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంట్రాడేలో టెక్ కంపెనీల సూచీ 3 శాతం మేర పతనమైంది. ప్రధాన ఐటీ కంపెనీల షేర్లలో నేడు విక్రయాల జోరు కొనసాగటం సెన్సెక్స్-నిఫ్టీలను నష్టాల్లోకి నెట్టింది.

టెక్ పరిశ్రమ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు వరుసగా 3.5%, 2.7% క్షీణించాయి. ఈ రెండు కంపెనీలో జనవరిలో మెరుగైన త్రైమాసిక ఫలితాలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యాక్సెంచర్ వృద్ధి అంచనాల తగ్గింపు ఐటీ పరిశ్రమ భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునేలా చేయటం ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేసింది. ప్రధాన మార్కెట్లైన యూకే, యూఎస్ లలో ఆర్థిక మందగమనం ఇంకా కొనసాగుతూనే ఉండటం కొత్త డీల్స్ లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ క్లయింట్ల నుంచి డిమాండ్ పునరుద్ధరణపై ఆశలు రేకెత్తించాయి. కీలక మార్కెట్ల మార్కెట్‌లో, ఖాతాదారుల బడ్జెట్ తగ్గింపు డీల్స్ ఆలస్యం లేదా రద్దుకు కారణంగా ఉంది.
ఐటీ కంపెనీలు బౌన్స్ బ్యాక్ అవుతాయనే ఆశలపై యాక్సెంచర్ తాజా అంచనాలు నీళ్లు చల్లాయి. తక్కువ డీల్స్, క్లయింట్ ఖర్చుపై మరిన్ని పరిమితులు, నెమ్మదిగా నిర్ణయం తీసుకోవడం ప్రతికూలంగా మారాయని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ భారత మార్కెట్ల ర్యాలీ తర్వాత ప్రస్తుతం యాక్సెంచర్ హెచ్చరికలు ఐటీ షేర్లు వాల్యుయేషన్‌లపై ఆందోళనలకు దారితీసింది. ఇది రిటైలర్ల నుంచి అమ్మకాల ఒత్తిడిని ప్రేరేపించిందని నిపుణులు చెబుతున్నారు.
"ఐటీ రంగానికి డిమాండ్ ఔట్‌లుక్ దృష్టిలో రికవరీ లేకుండా అధ్వాన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నందున, నిఫ్టీ ఐటి వాల్యుయేషన్స్ ... రిచ్‌గా కనిపిస్తున్నాయి" అని జెఫరీస్ ఒక నోట్‌లో తెలిపింది. ఐటీ కంపెనీ స్టాక్‌లు వాటి ఆదాయాల కంటే 26 రెట్లు ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాయని బ్రోకరేజ్ పేర్కొంది. ఇది వారి ఐదేళ్ల సగటుకు 13% ప్రీమియం, నిఫ్టీ 50కి 29% ప్రీమియం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications