Wipro News: టెక్ ప్రకంపనలు.. విప్రోలో వందల మంది టెక్కీల లేఆఫ్.. షాకింగ్..
Wipro Layoffs: ఇప్పటి వరకు టెక్ లేఆఫ్స్ అనగానే ఎక్కువగా విదేశీ కంపెనీల పేర్లను మనం చూశాం. అయితే చాలా కాలంగా భారత టెక్కీలకు ఉన్న ఆందోళనలు ప్రస్తుతం నిజమయ్యాయి. దీంతో చాలా మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
తాజాగా దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో నాలుగో స్థానంలో ఉన్న విప్రో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఐటీ సేవలం సంస్థ అత్యల్ప ఆదాయ మార్జిన్లను డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో పోస్ట్ చేసింది. దీంతో కంపెనీ దిద్దుబాటు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. లాభదాయకత 16 శాతానికి పడిపోవటంతో లేఆఫ్ మంత్రాన్ని అందుకుంది. ఈ సమయంలో టీసీఎస్ మార్జిన్లు 25 శాతం, ఇన్ఫోసిస్ మార్జిన్లు 20.5 శాతం ఉండగా హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లాభదాయకత 19.8 శాతంగా ఉన్నట్లు ఫలితాల్లో ప్రకటించాయి.

కంపెనీ ఖర్చుల తగ్గింపుకు దిగటంతో లేఆఫ్స్ మెుదలవగా బాధిత ఉద్యోగులకు నెల ప్రారంభంలో నోటీసులను విప్రో యాజమాన్యం పంపినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో వందలాదిమంది మిడ్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు లేఆఫ్ అవుతున్నారు. విప్రో 2021లో క్యాప్కో కన్సల్టింగ్‌ను $1.45 బిలియన్లకు కొనుగోలు చేసింది. అయితే కరోనా తర్వాత వ్యాపారం మందగించటంతో కంపెనీకి కొత్త కష్టాలు ఎదురయ్యాయి.
ప్రస్తుత త్రైమాసికంలో లాభాలను మెరుగుపరిచే బాధ్యతను విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అపర్ణ అయ్యర్‌కు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు లేఆఫ్ నివేదికలపై విప్రో అధికారింగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మారుతున్న మార్కెట్ వాతావరణంతో పాటు ఏఐ సవాళ్ల మధ్య టాలెంట్ రీస్ట్రక్చరింగ్ వ్యూహాన్ని కంపెనీ ప్రస్తుతం అవలంభిస్తోందని తెలుస్తోంది. అయితే రానున్న కాలంలో మరిన్ని కంపెనీలు ఇదే తరహాలో లేఆఫ్స్ టెక్ రంగంలో ప్రకటించే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కంపెనీలు కొత్త నియామకాలను మాత్రం చేపట్టడం లేదు.


Click it and Unblock the Notifications