TCS News: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ బలమైన త్రైమాసిక ఫలితాలను విడదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ అంచనాలను విఫలమైనప్పటికీ.. గత ఏడాది కంటే మెరుగైన లాభాలను నమోదు చేసింది.
అయితే ఇప్పుడు కంపెనీలోని ఉద్యోగుల చూపు వేతనాల పెంపుపై ఉంది. ఈ క్రమంలో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ జీతాల పెంపుపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. మరోపక్క టెక్ దిగ్గజం యాక్సెంచర్ 19,000 మంది ఉద్యోగుల తొలగింపును వేగవంతం చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపులు ఉండవని మాత్రం దేశీయ టెక్ కంపెనీలు చెప్పలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలోని టాప్- 5 ఐటి కంపెనీలు తమ వ్యాపారం, ఆదాయాన్ని ఎక్కువగా BFSI సంస్థల నుంచి పొందుతున్నాయి. పైగా అమెరికా, యూరప్ లలో 80 శాతం వరకు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. అక్కడి మార్కెట్లలో బలహీనత, బ్యాంకింగ్ రంగం అస్థవ్యవస్థంగా ఉండటంతో ఇండియన్ టెక్ కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు ఈ ఏడాది జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీలోని టాప్ పెర్ఫార్మర్స్‌కు 12-15 శాతం జీతాల పెంపు ఉంటుందని మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మిగిలిన ఉద్యోగులకు 1.5 శాతం నుంచి 8 శాతం వరకు జీతాల పెంపు ఉండనున్నట్లు వెల్లడించారు. అలాగే గత త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులు 100 శాతం వేరియబుల్ పే పొందే అవకాశం ఉందని తెలిపారు. దీంతో టీసీఎస్ ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ కొత్త నియామకాలను దాదాపు నిలిపివేసిందని చెప్పుకోవాలి. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కేవలం 821 మంది ఉద్యోగులు అంతకు ముందు ఏడాది కంటే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా నివేదించింది. TCS FY2023లో కేవలం 22,600 మంది ఉద్యోగులను మాత్రమే కొత్తగా చేర్చుకుంది.


Click it and Unblock the Notifications