IT News: దేశంలో లక్షలాది ఉద్యోగాలను అందిస్తూ చాలా మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచటంలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించింది. అయితే గత సంవత్సర కాలంగా ఇది కళ తప్పింది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పాటును అందిస్తున్న ఐటీ రంగంలో జరిగే ప్రతి మార్పు వ్యాపార వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మనకు ఐటీ రంగం అభివృద్ధి చాలా ముఖ్యమైనది, కీలకమైనది కూడా. ఈ క్రమంలో 2023 ప్రారంభం నుంచి భారతీయ ఐటీ పరిశ్రమ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక ప్రతికూలతల నేపథ్యంలో టెక్నాలజీ కస్టమర్లు తమ ప్రధాన ప్రాజెక్టులను రద్దు చేయడం, నిలిపివేయడం ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెలలో భారతీయ ఐటీ కంపెనీలు సైతం ఇదే పరిస్థితిని చూశాయి. టాప్ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ కొన్ని విదేశీ కస్టమర్ల డీల్స్ క్లోజ్ చేసుకున్నాయి. ఇది కంపెనీలకు పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. దీంతో పెద్ద పెద్ద ఐటీ సర్వీస్ కంపెనీలు ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.
ఒకపక్క వ్యాపారంలో డీల్స్ కోల్పోతూ నష్టపోతుంటే.. మరో పక్క అస్థిరత కారణంగా ఆదాయాలు, మార్జిన్లు తగ్గటం టెక్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా టెక్కీలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలోనే వేరియబుల్ పే విషయంలో టెక్కీలు కోతలను చూశారు.. ఈ సంవత్సరం పరిస్థితి మరింత కఠినంగా ఉండవచ్చని తెలుస్తోంది.

మార్చి త్రైమాసికంలో ఆదాయం తగ్గడానికి పెద్ద కాంట్రాక్టు రద్దు కావడమే కారణమని ఇన్ఫోసిస్ మర్చిపోకూడదు. దీని తర్వాత జూన్‌లో TCS 2 బిలియన్ డాలర్ల ట్రాన్స్‌అమెరికా కాంట్రాక్ట్‌ను సగంలోనే కోల్పోయింది. భారీ ఐటీ సర్వీస్ కంపెనీలు ఇంత భారీ ఐటీ ప్రాజెక్టులను కోల్పోవడం అరుదైన సంఘటనని చెప్పుకోవాలి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని బట్టి ఐటీ కంపెనీలు చిన్న ప్రాజెక్టులు లేదా షార్ట్ టర్మ్ ప్రాజెక్టులను పొందుతాయని తెలుస్తోంది. వీటిని తరువాతి దశల్లో పొడిగించే అవకాశం ఉందని ఔట్ సోర్సింగ్ నిపుణుడు ప్రతీక్ జైన్ తెలిపారు.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్‌పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications