Tech News: వందలు వేల కోట్ల విలువైన కంపెనీలను సృష్టించటం ప్రస్తుత కాలంలో సర్వ సామాన్యమైనదిగా మారిపోయింది. నిరాఢంబరంగా ప్రస్థానం ప్రారంభించిన అనేక టెక్ కంపెనీలు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కీలకమైనవిగా మారినప్పటికీ ఉద్యోగులపై పెద్దగా శ్రద్ధ చూపని పరిస్థితులు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో టెక్ రంగంలోని Ideas2IT కంపెనీ మాత్రం ఉద్యోగులను కంపెనీలో యజమానులుగా మార్చేస్తోంది. భారత్ ప్రధాన కార్యాలయం కలిగిన టెక్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అయితే తాజాగా ఇందులో 33 శాతం వాటాను ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక టెక్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఈ వార్త చూసిన అనేక మంది టెక్కీలు తాము ఇక్కడ పనిచేస్తుంటే బాటుండునని భావిస్తున్నారు.

కంపెనీ తాను ఉద్యోగులకు అందించాలనుకున్న 33 శాతం వాటాలో 5 శాతాన్ని సంస్థ 2009లో ప్రారంభమైన నాటి నుంచి ఉన్న 40 మంది ఉద్యోగులకు అందించాలని నిర్ణయించింది. మిగిలిన 28 శాతం వాటాను కంపెనీలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి పంపిణీ చేయనుంది. అలాగే దీనికి తోడు ఐదేళ్లుగా కంపెనీలో పనిచేస్తూ సేవలందిస్తున్న 50 మంది ఉద్యోగులకు 50 కార్లను అందజేస్తోంది.
2009లో కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి 100 మిలియన్ డాలర్లుగా ఎదిగిన కంపెనీ ఆ ఫలితాలను తన ఉద్యోగులకు పంచాలని నిర్ణయించింది. కంపెనీకి ఇండియాతో పాటు యూఎస్, మెక్సికోలో కూడా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు తమ పని సమయంలో 30-40 శాతాన్ని ఉద్యోగానికి వెచ్చిస్తారని వెల్లడైంది. ఉద్యోగులతో కంపెనీ ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన, బలమైన అనుబంధాన్ని కలిగి ఉందని కంపెనీ వ్యవస్థాపకులు మురారి వివేకానందన్ పేర్కొన్నారు. వాస్తవానికి కంపెనీని ప్రారంభించటానికి ముందర సన్, ఓరాకిల్, గూగుల్ కంపెనీల్లో పనిచేశారు.
ఉద్యోగులు రూ.8-15 లక్షలు మధ్య ధరల శ్రేణిలో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకునేందుకు కంపెనీ అవకాశం కల్పించింది. పైగా ఈ వాహనాలు నేరుగా సదరు ఉద్యోగి పేరుపైనే రిజిస్టర్ చేయబడతాయి. అలాగే దీనికి ఎలాంటి రూప్స్ లింక్ చేయబడలేదు. 2022 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇప్పటికే 100 కార్లను అందించినందున.. ఈసారి కేవలం 50 కార్లను మాత్రమే అందించారు. ప్రస్తుతం సంస్థకు అనేక ఫార్చ్యూన్ 500 క్లయింట్లు ఉన్నారు. కంపెనీ ప్రధానంగా టైర్-2, టైర్-3 నగరాల నుంచి 90 శాతం మంది యువ టెక్కీలను నియమించుకుంటోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications