Stock Market: హుషారుగా మార్కెట్ సూచీలు.. లాభాల్లో ముందుకు..
Stock Market: నిన్న ఫ్లాట్ గా ట్రేడ్ అయిన మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. కీలక సూచీలు లాభాల్లో కొనసాగుతూ ఇన్వెస్టర్లలో జోష్ నింపుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటానియా, HDFC లైఫ్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
ఉదయం 10 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 141 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 111 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 256 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

NSEలో బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, హిందాల్కొ, ఓఎన్జీసీ, ఐటీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications