Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. యూఎస్ ఫెడ్ మినిట్స్ ఎఫెక్ట్..
Market Opening: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని ఒడిదొడుకుల్లో ఫ్లాట్ గా ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన ఇటీవలి సమావేశానికి సంబంధించిన మినిట్స్ విడుదల చేయటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప లాభాలతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 50 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 24 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో టీసీఎస్, విప్రో, సుజుకీ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం కూడా భారత మార్కెట్ల డీలాకు ఒక కారణంగా నిలుస్తోంది.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, సిప్లా, టాటా కన్జూమర్, యూపీఎల్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, సిప్లా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టైటాన్, ఐటీసీ, ఎల్ టిఐఎమ్, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, నెస్లే, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, మారుతీ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications