Stock Market: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. అదరగొట్టిన ఆటో, PSU బ్యాంక్స్..
Market Closing: కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నెగటివ్ నోట్ లో ప్రారంభించి చివరికి అదే ధోరణిలో ముగించాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో మార్కెట్ల వరుస లాభాలకు మూడు రోజుల తర్వాత బ్రేక్ పడింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 242 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 59 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 252 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 172 పాయింట్లను కోల్పోయాయి. నేడు ఇంట్రాడే మార్కెట్ల సమయంలో ఆటో, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు మంచి పనితీరును కనబరిచి లాభపడ్డాయి.

NSEలో పవర్ గ్రిడ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, బ్రిటానియా, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, టటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, గ్రాసిమ్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications