Opening Bell: భారతీయ స్టాక్ మార్కెట్లు తమ కొత్త వారం ప్రయాణాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. వాస్తవానికి సెబీ చీఫ్ అదానీ కుంభకోణంలో వినియోగించిన ఫండ్స్ లో పెట్టుబడులు కలిగి ఉండటంతో పాటు తన భర్త ద్వారా బ్లాక్ స్టోన్ కంపెనీకి అనుకూలంగా పనిచేసినట్లు హిండెన్ బర్గ్ ఆరోపణలు మార్కెట్లలో పెద్ద భూకంపాన్ని సృష్టిస్తున్నాయి.
ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 68 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 147 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 179 పాయింట్ల మేర నష్టాలతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.

NSEలో గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, హిందాల్కొ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టైటాన్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇన్వెస్టర్స్ స్టే కామ్: SEBI
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికను అనుసరించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లకు భరోసా కల్పించేందుకు, మార్కెట్ సెంటిమెంట్‌ను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ సెబీ సైతం చైర్‌పర్సన్ కు బాసటగా నిలిచింది. అలాగే సెబీ తన స్వాతంత్రను, పారదర్శకతను నొక్కిచెప్పింది, అవసరమైన అన్ని బహిర్గతం చేయబడిందని పేర్కొంది. అమెరికా షార్ట్ సెల్లర్ వరస ఆరోపణల మధ్య ఇన్వెస్టర్లు ప్రశాంతంగా ఉండాలని సెబీ కోరింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications