Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ పెరుగుదలను చూసిన తర్వాత నేడు నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు నష్టాలతో కొనసాగుతుండగా, మెటల్ స్టాక్స్ మాత్రం లాభాలతో ముందుకుసాగుతున్నాయి.
ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 96 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 33 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 5 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 248 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతోంది. అయితే క్రమంగా సూచీలు నష్టాలను తగ్గించుకుంటూ లాభాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కొ, విప్రో, పవర్ గ్రిడ్, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఎల్ టి, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications