Stock Market: లాభాల్లో కొత్త వారం ప్రారంభించిన సూచీలు.. ఫోకస్‌లో జొమాటో స్టాక్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని స్వల్ప లాభాలతో ప్రారంభించాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండటం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 28 పాయింట్ల స్వల్ప లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 201 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 100 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో మార్కెట్లో ప్రధానంగా టాటా మోటార్స్, జొమాటో, డాక్టర్ రెడ్డీస్, విప్రో కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, బీపీసీఎల్, ఎల్ టి, రిలయన్స్, గ్రాసిమ్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బ్రిటానియా సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, సన్ ఫార్మ్, మారుతీ, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, విప్రో, అపోలో హాస్పిటల్స్, టైటాన్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications