Market Opening: నిన్న అనూహ్యంగా లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో సిప్లా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు ఫోకస్లో ఉన్నాయి.
నేడు ఉదయం 9.38 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 11 పాయింట్ల స్వల్ప నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 418 పాయింట్ల భారీ లాభంతో ట్రేడవుతున్నాయి. ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ మార్కెట్లలో అధిక ఓలటాలిటీ కొనసాగుతూనే ఉంది.

ఎన్ఎస్ఈలో సిప్లా, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, ఎయిర్ టెల్, హీరో మోటార్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఎల్ టిఐఎమ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బ్రిటానియా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, మారుతీ, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నేడు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications