Stock Market: మార్కెట్ల సడెన్ ఫాల్.. ఒక్కసారిగా లాభాల ఆవిరి..
Opening Bell: వరుస ర్యాలీ తర్వాత నిన్న స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ప్రీఓపెనింగ్ సెషన్లో మార్కెట్లు లాభాలతో కనిపించాయి.
అయితే మార్కెట్లు ప్రారంభం కాగానే ఒక్కసారిగా లాభాలు ఆవిరై నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 43 పాయింట్ల మేర నష్టాల్లో ఉంది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 34 పాయింట్ల లాభంతో ముందుకు సాగటంతో మార్కెట్లు చాలా ఓలటాలిటీని ప్రదర్శిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, బీపీసీఎల్, యూపీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, ఎల్ టి, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మారుతీ, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, బజాజ్ ఆటో, టైటాన్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, సిప్లా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications