Stock Market: స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. 22,500 మార్క్ దిశగా నిఫ్టీ ప్రయాణం..
Market Opening: నెల చివరి వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నేడు ఫ్లాట్ గా ప్రారంభించాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ తన కొత్త గరిష్ఠాలను తాకినప్పటికీ.. మరొక రికార్డును త్వరలోనే చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 13 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 60 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 117 పాయింట్లు పెరిగింది. అయితే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుండటంతో సూచీలు క్రమంగా మరిన్ని నష్టాల్లోకి జారుకుంటున్నాయి.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, విప్రో, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎయిర్ టెల్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications