Stock Market: నిన్న ఒఫ్లాట్ ముగింపును నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ప్రీ ఓపెనింగ్ సెషన్లో లాభాలతో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. అమెరికా స్టాక్స్ భారీ ర్యాలీని నమోదు చేసినప్పటికీ ఓలటాలిటీ కొనసాగుతోంది.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 23 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా ఓలటాలిటీ మధ్య బ్యాంక్ నిఫ్టీ సూచీ 43 పాయింట్ల నష్టంలో ట్రేడవుతోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 230 పాయింట్లు లాభపడి ఆశాజనకంగా ముందుకు కొనసాగుతోంది. ఈ క్రమంలో అపోలో టైర్స్, శ్రీ సిమెంట్స్, ఐఆర్సీటీసీ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఫిచ్ భారతదేశ మధ్య-కాల GDP వృద్ధి అంచనాను 6.2%కి పెంచడంతో నిఫ్టీ 19,483కి చేరుకుంది. వాల్ స్ట్రీట్ విజయ పరంపరతో ఉత్సాహంగా లాభాల్లో ఉండటం కొంత ఊరటను కలిగిస్తోంది. ఇదే క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు దీపావళి కోసం కొన్ని కంపెనీల షేర్లలో ఇప్పటికే తమ ట్రేడింగ్ మెుదలుపెట్టారు. మరికొందరు ఈక్విటీల షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, విప్రో, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్, ఎల్ టి, దివీస్ ల్యాబ్, రిలయన్స్, టైటాన్, మారుతీ, యూపీఎల్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బ్రిటానియా, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఐటీసీ, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
ఇదేక క్రమంలో హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications