Stock Market: దేశీ మార్కెట్లలో అమెరికా జోరు.. ఒడిదొడుకుల్లో మెుదలైన Sensex, Nifty..
Market Opening: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్లు లాభాల్లో పయనించగా.. ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో కొనసాగటం గమనార్హం.
మార్కెట్లు ప్రారంభానికి ముందు సూచీలు తేలికపాటి లాభాలను నమోదు చేయగా.. నేడు ఎస్బీఐ, టాటా మోటార్స్, ఇండిగో కంపెనీల షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ మాత్రం 10 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 248 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 67 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. మెుత్తానికి కొత్త వారం మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఎటు వెళ్లాలో తెలియక గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది.

NSEలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, టాటా స్టీల్, బజాజ్ ఆటో, టీసీఎస్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, మారుతీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications