Opening Bell: నష్టాలకు బ్రేక్ ఇచ్చిన మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ.. ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఊగిసలాటను కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 13 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 56 పాయింట్ల నష్టంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 113 పాయింట్ల మెగా గెయిన్ కొనసాగిస్తోంది.

NSEలో నెస్లే, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, టాటా స్టీల్, ఐటీసీ, సన్ ఫార్మా, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, విప్రో, యూపీఎల్, ఎల్ టి, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, మారుతీ, టైటాన్, హిందాల్కొ, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, టీసీఎస్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications