Stock Market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. ముందుంది ముళ్లదారంటున్న విశ్లేషకులు..
Maret Opening: నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో కీలక సూచీలు భారీగా క్షీణతను నమోదు చేశాయి.
ఉదయం 9.38 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 687 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 194 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 530 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 446 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి రానున్న కాలంలో కూడా కొనసాగుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు ప్రస్తుతం అంచనా వేస్తున్నారు.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, మారుతీ, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, సిప్లా, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో నేడు కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications