Stock Market: ఒడిదొడుకుల్లో ప్రారంభమైన Sensex, Nifty.. గందరగోళంగా గ్లోబల్ మార్కెట్లు..
Market Opening: సెలవు తర్వాత కొత్త వారంలోకి ప్రవేశించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ రోజు మార్కెట్లో ఫోకస్ ప్రధానంగా క్యూ2 ఫలితాలను విడుదల చేయనున్న హెచ్డ్ఎఫ్సీ బ్యాంక్ షేర్లపై ఉండనుంది.
ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉండటంతో పాటు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు గాజాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ధరలు మళ్లీ బ్యారెల్ 90 డాలర్లకు పైన కొనసాగటం ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ గ్లోబల్ ప్రతికూలత మధ్య ప్రీఓపెన్ మార్కెట్లో సూచీలు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించాయి.

ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 151 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం వీటికి భిన్నంగా 61 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. దీంతో మెుత్తానికి మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో నెస్లే, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా, ఎల్ టి, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, విప్రో, రిలయన్స్, టాటా మోటార్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications