Stock Market: ఫ్లాట్ ప్రారంభంలో మార్కెట్లు.. మిశ్రమంగా గ్లోబల్ మార్కెట్లు..
Market Opening: దేశీయ మార్కెట్లలో అదానీ, వేదాంతా గ్రూప్ ఎదుర్కొంటున్న ఆరోపణలకు తోడు.. మిశ్రమంగా ఉన్న ఆసియా, అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలను ఒడిదొడుకుల్లో నడిపిస్తోంది.
మార్కెట్లు ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 42 పాయింట్లతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 20 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 6 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు ప్రధానంగా మార్కెట్లలో ఆటో స్టాక్స్ ఫోకస్ లో కొనసాగుతున్నాయి.

NSEలో జియో ఫైనాన్సియల్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, టైటాన్, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications