Stock Market: నిన్న లాభాలతో ప్రయాణాన్ని ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనిశ్చితితో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న వపనాలు దేశీయ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేయటంతో ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 26 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 47 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతోంది.

ప్రధానంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో పాటు నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం దీనికి కారణంగా తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల మేర ఏడాది చివరి వరకు తగ్గించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించటంతో క్రూడ్ ధరలు కుతకుతలాడుతున్నాయి. ఇదే క్రమంలో రష్యా సైతం ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించింది.
ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, సిప్లా, ఎల్ టిఐఎమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, రిలయన్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్షియల్, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, నెస్లే, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications