Opening Bell: నిన్న ఫ్లాట్ ముగింపును చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో బ్యాంకింగ్ స్టాక్స్ తమ మెరుపులను కొనసాగిస్తుండగా.. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగటం ఓలటాలిటీని పెంచుతోంది.
దీంతో మార్కెట్లలో అలజడి కొనసాగుతుండగా ఆరంభ లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉదయం 9.31 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 177 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 179 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. కీలక సూచీలు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి.

ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, హిందాల్కొ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, ఎల్ టి, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, బీపీసీఎల్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, నెస్లే, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్ల నష్టాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications