Stock Market: స్వల్ప ఒడిదొడుకుల్లో మార్కెట్లు.. పతనమైన పేటీఎం స్టాక్..
Market Opening: నిన్న భారీ పతనం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా హిందాల్కొ షేర్లు 10 శాతం మేర పతనం కాగా.. పేటీఎం స్టాక్ దాదాపు 7 శాతం మేర పతనాన్ని నమోదు చేసింది.
ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 24 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 153 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 484 పాయింట్ల మేర భారీ క్షీణతతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్ది మార్కెట్లలో ఒడిదొడుకులు క్రమంగా తగ్గుతూ లాభాల్లోకి వస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, విప్రో, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెస్ సిమెంట్స్, టైటాన్, టీసీఎస్, యూపీఎల్, ఎయిర్ టెల్, ఎల్ టిఐఎమ్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications