Stock Market: గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్.. ఓలటాలిటీలో ఇండియన్ మార్కెట్స్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల తర్వాత నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని చూశాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం ఓలటాలిటీలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.47 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ 16 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 102 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి. అయితే మార్కెట్లు వేగంగా నష్టాల నుంచి తేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగంలోని కంపెనీల షేర్లు లాభాలతో ముందుకు సాగుతుండగా.. పవర్, రియల్టీ రంగాల స్టాక్స్ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, టైటాన్, బీపీసీఎస్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, కోల్ ఇండియా స్టాక్స్ లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, బ్రిటానియా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, నెస్లే, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రాజెస్, ఐషర్ మోటార్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications