Opening Bell: గతవారం భారీ బుల్ ర్యాలీని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ప్లాట్ ఆరంభాన్ని నమోదు చేశాయి. ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదొడుకులతో సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచీ సైతం ఇదే సూచించింది.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ సూచీ 61 పాయింట్లు కోల్పోయింది. అయితే సూచీలు వేగంగా లాభాల్లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 196 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతోంది. ఇంట్రాడేలో టాటా మోటార్స్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా.. టైటాన్ స్టాక్ నష్టాలను నమోదు చేసింది. సమయం గడిచే కొద్ది మార్కెట్లు లాభాల మార్గంలోకి రావచ్చని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడింగ్ ముగించిన సంగతి తెలిసిందే.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, హీరో మోటార్స్, విప్రో, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, సిప్లా, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో టైటాన్, దివీస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications