Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. ఫైనాన్స్ స్టాక్స్ భేజారు..
దేశీయ స్టాక్ మార్కెట్లు లాంగ్ వీకెండ్ సెలవుల తర్వాత నేడు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలోని షేర్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 34 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 13 పాయింట్ల స్వల్ప నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 115 పాయింట్ల లాభంలో ఉంది.

NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, కోల్ ఇండియా, గ్రాసిమ్, టైటాన్, పవర్ గ్రిడ్, విప్రో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, నెస్లే, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, సిప్లా, మారుతీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, ఎల్ టి, హెచ్సీఎల్ టెక్, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications