Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగానికి ముందురోజైన నేడు నష్టాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. గతవారాన్ని నష్టాల్లో ముగించిన సూచీలు జూలై చివరివారంలోనూ అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 412 పాయింట్ల నష్టంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 325 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 544 పాయింట్ల పతనంలో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ నేడు ఫోకస్ లో కొనసాగుతున్నాయి. ఇవి గతవారం చివరిలో తమ కార్పొరేట్ క్యూ1 ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

NSEలో అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, నెస్లే, బీపీసీఎల్, ఐటీసీ, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, టీసీఎస్, ఓఎన్జీసీ, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో విప్రో, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, సిప్లా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications