Stock Market: భారత మార్కెట్లపై యూఎస్ పిడుగు.. నష్టాల్లో Sensex, Nifty..
Market Opening: నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల బాట పట్టాయి. వాస్తవానికి అమెరికా మార్కెట్లు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పావెల్ కీలక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నష్టల్లో ముగిశాయి.
ఉదయం 9.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 139 పాయింట్ల నష్టంలో ఇంట్రాడేలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 88 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. యూఎస్ మార్కెట్లను అనుసరిస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, బ్రిటానియా, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్జూమర్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, రిలయన్స్, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టి, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్యూ స్టీల్, విప్రో, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications