Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ గా ట్రేడింగ్ మెుదలు పెట్టాయి. ముందుగా తక్కువ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొన్ని నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా మార్కెట్లలో ఓలటాలిటీ, అనిశ్చితి వాతావరణం దీనికి కారణంగా తెలుస్తోంది.
అయితే ఉదయం 9.34 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 38 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 135 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 27 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి.

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో సరైన దిశానిర్థేశం లేకపోవటం వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అమెరికా డెట్ సీల్ చర్చలు కొలిక్కి రాకపోవటంతో యూఎల్, యూరోపియన్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడింగ్ ముగించాయి. అయితే ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపై కూడా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఫెడ్ మినిట్స్ బయటకు రావటం కూడా మార్కెట్లను కొంత మేర ప్రభావితం చేస్తోంది.
NSE సూచీలో బ్రిటానియా, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, నెస్లే, ఐటీసీ, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, ఎల్ టి, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని హిందాల్కొ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటార్స్, సిప్లా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications