Stock Market Update: వారం రోజులకు పైగా మార్కెట్ సూచీలు పైపైకి దూసుకుపోయాయి. అయితే వారాంతాలో మాత్రం ఒక్కసారిగా చతికిలపడ్డాయి. అయితే ఇది ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ వల్ల కావచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ల పనితీరుతో సంబంధం లేకుండా మన మార్కెట్లు పురోభివృద్ది చెందటంతో చాలా మంది ముందస్తుగా ప్రాఫిట్ బుక్కింగ్ కి మెుగ్గుచూపుతున్నారు.

నష్టాలతో ఆరంభమై..
ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సమయం గడిచేకొద్ది మధ్యాహ్నానికి మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 552 పాయింట్లు, నిఫ్టీ సూచీ 156 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్ల నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అయితే దీనికి విరుద్ధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 180 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు..
భారత మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ తో పాటు యూఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతున్న సూచికగా అనేక విషయాలు జగటం రానున్న కాలంలో ఆర్థికానికి కీలకంగా మారనున్నాయి. చాలా మంది ఆర్థికవేత్తలు సైతం నెమ్మదించిన భారత వృద్ధి రేట్లతో మంచే జరుగుతుందని అంచనా వేశారు.

టాప్ గెయినర్స్..
12.33 గంటల సమయంలో అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, గ్రాసిమ్, బ్రిటానియా, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, హిందాల్కొ లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్, సిప్లా, హీరోమోటొకార్ప్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, మారుతీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ, ఏషియన్ పెయింట్స్ తో పాటు మరిన్ని స్టాక్స్ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications