Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. తిరోగమనంలో సెన్సెక్స్-నిఫ్టీ.. అదే కారణం..!
Market Opening: నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఆరంభం నుంచే డీలా పడ్డాయి. వాస్తవానికి ఫెడ్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు వరుస ఓలటాలిటీ నుంచి తేరుకుని స్థిమితపడ్డాయి.
ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 252 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయింది. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 82 పాయింట్ల మేర లాభంతో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా నష్టపోయి 23 పాయింట్ల నష్టంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రధానంగా నేడు ఐటీ సేవల కంపెనీలో ఉన్న కంపెనీలు నష్టపోవటం మార్కెట్ల పతనానికి దారితీసింది.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, సన్ ఫార్మా, యూపీఎల్, ఐటీసీ, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కొ, ఎల్ టి, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, హీరో మోటార్స్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications