Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ.. గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలతో..
Market Opening: నిన్న లాభాలు ఆవిరై చివరికి స్వల్ప నష్టాలతో ప్లాట్ ముగింపును నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్ నేడు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఉదయం గిఫ్ట్ నిఫ్టీ సంకేతాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు క్షీణతను కొనసాగిస్తున్నాయి.
ఉదయం 10.03 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 222 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 85 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, ఐటీసీ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, ఐటీసీ, బ్రిటానియా, టాటా కన్జూమర్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ఆరంభంలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications