Stock Market: మార్కెట్లలో యూనియన్ బడ్జెట్ టెన్షన్.. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు..
Market Opening: కొత్త వారంలో వరుసగా రెండో రోజు సైతం దేశయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. దీనికి తోడు రేపు యూనియన్ బడ్జెట్ ప్రకటన ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెస్సెక్స్ 185 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో సూచీ నిఫ్టీ 50 పాయింట్ల మేర నష్టంలో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 210 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 64 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది.

ఇదే క్రమంలో ప్రధానంగా అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించటం, రానున్న ఫెడ్ మీటింగ్, మధ్యంతర బడ్జెట్ దేశీయ పెట్టుబడిదారులను అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలో టీసీఎస్, వోల్టాస్, ఎల్ టి కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, కోల్ ఇండియా, రిలయన్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, సన్ ఫార్మా, టాటా స్టీల్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, ఐటీసీ, ఐషర్ మోటార్స్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఎల్ టి, టైటాన్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, హీరో మోటార్స్, విప్రో, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా మార్కెట్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications