Market Opening: నిన్న లాభాల ప్రయాణం కొనసాగించిన దేశీయ మార్కెట్లు నేడు గ్లోబల్ మార్కెట్ల పనితీరుతో చతికిలపడ్డాయి. ఆరంభంలోనే ఒత్తిడికి లోనైన సూచీలు స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 131 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 104 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం వీటికి భిన్నంగా 45 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది.

ప్రధానంగా చైనా ఉత్పత్తి డేటా ఊహించిన దానికి భిన్నంగా అధికంగా నమోదు కావటంతో గ్లోబల్ మార్కెట్లు నీరశించాయి. దీనికి తోడు ఆసియా, అమెరికా మార్కెట్లు సైతం ప్రతికూలంగా ఉండటం దేశీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేసిందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క టెక్నికల్స్ పరిశీలిస్తే.. మార్కెట్ అధిక స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌ను చూస్తోందని ప్రోగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ వెల్లడించారు. అయితే సూచీలు తమ లాభాలను నిలబెట్టుకోవటం సానుకూలమైన అంశమంటూ పేర్కొన్నారు.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, దివి ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, గ్రాసిమ్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications